పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ జూలై 26
తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీపాళెం బ్రహ్మానందరెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి దశదిన కర్మక్రియలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బుజ్జిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు కూడా బుజ్జిరెడ్డి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బుజ్జిరెడ్డి పార్టీకి అంకితభావంతో సేవలందించిన నాయకుడని కొనియాడుతూ, ఆయన లేనిలోటు ఎన్నటికీ తీరనిదని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దశదిన కర్మ క్రియలకు వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బుజ్జిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.



