ఖమ్మం, జూలై
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు గారి సూచనల మేరకు రాష్ట్ర నాయకులు శ్రీ తాండ్ర వినోద్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్ప్ డెస్క్ సహాయక కేంద్రం కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. 57వ డివిజన్లోని వికలాంగుల కాలనీలో ఉన్న 114వ పోలింగ్ బూత్ వద్ద రుద్రగాని మాధవరావు ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సహాయం, ఓటరు జాబితా సంబంధిత వివరాలు, దరఖాస్తులపై మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో BLOలు, బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు దనియాకుల వెంకటనారాయణ, మహేందర్ సింగ్, వేల్పుల సుధాకర్, రామారావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్వాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని నాయకులు కోరారు.



