*బీఆర్ఎస్ పార్టీలో చేరిన గిద్దిగిరి*
ఏన్కూర్ మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రధాన అనుచరుడు, ఏన్కూర్ మాజీ మండల అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు, తూతక్క లింగన్న పేట మాజీ ఉప సర్పంచ్, బీసీ సంఘ నాయకులు గిద్దిగిరి సత్యనారాయణ బుధవారం నాడు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు, బానోత్ మంజుల మదన్ లాల్ ఆధ్వర్యంలో, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కెళ్ళ పల్లి రవీంద్ర సమక్షంలో, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో గిద్దిగిరి సత్య నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అబద్దపు హామీలు చూడలేక, బీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు ఆయన అన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న పాత పరిచయాలను మరొక్కసారి గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, గత పూర్వవైభవాన్ని మళ్ళీ ఏన్కూర్ మండలం చిగురించేలా అన్నీ విధాలా శ్రమించి నూతన ఉత్సహన్నీ తెస్తానని అన్నారు.

