రాష్ట్రంలో అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, అనారోగ్య బాధితులకు కొత్త పింఛన్లు, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ఏపీ వికలాంగులు పింఛన్‌దార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 12 నుంచి స్వర్ణ గ్రామంలో కొత్త పింఛన్ల దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో అర్హులందరికీ న్యాయం చేయాలన్నారు. వికలాంగులకు కుటుంబ ఆస్తులతో సంబంధం లేకుండా ఇంటి స్థలాలు, పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులు, మహిళలపై దాడుల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులందరికీ పింఛన్లు, పక్కా ఇళ్లు ఇవ్వాలి: జె.ఎన్. ఆంధ్రయ్య