కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మర్రిపాడు మండలం డి సి పల్లి పొగాకు బోర్డ్ ను సందర్శించి రైతులకు కష్టాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దోసుకుంటున్నారని ఐటిసి కంపెనీ విపరీతంగా కోతలు విధిస్తూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు .రోజువారీగా పొగాకు బారిని సీజన్ కి అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న రైతులు కష్టాలు మాత్రం తీరలేదు పండించిన పొగాకు పంటకు రేట్లు తగ్గించి వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఐటిసి కంపెనీ పొందుతుంది. గత సంవత్సరం ఐటిసి కంపెనీకి 20వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఈ సంవత్సరం కూడా ఆదాయాన్ని దోచుకుని తినడానికి రైతులకు గిట్టుబాటు ధరలు వేయకుండా పోయిన సంవత్సరం కిలో 350 రూపాయలు దర ఉంటే ఈ సంవత్సరం రెండు వందల రూపాయలు మాత్రమే ఒరిజినల్ పొగాకు రేటు వేస్తున్నారు.చాల బాధాకరమని వారు అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పొగాకు బోర్డు యాజమాన్యంతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు.
Uploaded Video:


