Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

జాతీయ ఉత్పత్తిదారుల సమూహాల (PGs) బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం వేముల మండల వ్యాప్తంగా వేల్పుల గ్రామ మహిళా రైతుల ఆధ్వర్యంలో వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు నిర్వహించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల రైతుల జీవనోపాధులను బలోపేతం చేయడం, ఉత్పత్తిదారుల సమూహాలను (PGs) మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) అభివృద్ధి చేయడం లక్ష్యంగా రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో వ్యవసాయం, పశుసంవర్ధక, అటవీ ఆధారిత జీవనోపాధులు, సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, గ్రామీణ పరిశ్రమలు తదితర రంగాలలో పనిచేస్తున్న మహిళా సభ్యులను ఉత్పత్తిదారుల సమూహాలుగా (PGs) సంఘటితం చేసి, వాటిని రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా (FPOs) అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడతారు.ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి అవగాహన సమావేశాలు, సభ్యుల నమోదు, కొత్త PGల ఏర్పాటు, వ్యాపార ప్రణాళికల రూపకల్పన, బ్యాంకు అనుసంధానం, మార్కెటింగ్ అవకాశాలపై శిక్షణలు మరియు జీవనోపాధి విస్తరణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.మండలలో కస్టమర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చెప్పట్టడం జరుగుతుందని, వ్యవసాయ సఖి, పశు సఖి, వన సఖి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ల ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాలు, పండ్ల తోటల పెంపకం, వ్యవసాయ అదారిత ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు పైన మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘం కృషి చేస్తుందని అన్నారు

వేముల మండలంలోని అన్ని గ్రామ సంఘాలు (VOs), స్వయం సహాయక సంఘాలు (SHGs), కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, జీవనోపాధి సిబ్బంది మరియు మహిళా సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో సీసీ హరి కృష్ణ, గ్రామ సమాఖ్య అసిస్టెంట్ శాంతి, భార్గవి మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యులు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు

బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

బలోపేత జాతీయ ప్రచార కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *