Saturday, 5 September 2026
  • Home  
  • బంగారు పాల్యం జడ్పీ హైస్కూల్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం.
- చిత్తూరు

బంగారు పాల్యం జడ్పీ హైస్కూల్లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం.

బంగారుపాళ్యం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన నష్టాలను వివరించారు. చెడు స్నేహాలకు, ఆకర్షణలకు లోనుకాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రసాద్, ఈగల్ టీమ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బంగారుపాళ్యం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన నష్టాలను వివరించారు. చెడు స్నేహాలకు, ఆకర్షణలకు లోనుకాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రసాద్, ఈగల్ టీమ్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.