Wednesday, 9 September 2026
  • Home  
  • బంగారం చోరీ కేసు లో ఇద్దరు నిందితులకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష
- అనకాపల్లి

బంగారం చోరీ కేసు లో ఇద్దరు నిందితులకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష

దర్యాప్తు అధికారి, ఏపీపీలను అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బంగారం చోరీ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష వితించిందని అన్నారు. యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 04/2024, సెక్షన్ 454, 380 ఐపీసీ కింద నమోదైన కేసులో ఎస్ఐ ఉపేంద్ర సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. యలమంచిలి ఏజేఎఫ్సీఎం న్యాయస్థానంలో సీసీ నెంబర్ 564/2025 పై విచారణ ముగిసిందని తెలిపారు. దర్యాప్తు అధికారి సమర్పించిన ఆధారాలు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో సెక్షన్ 428 సీఆర్‌పీసీ కింద ఇద్దరు ముద్దాయిలకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఏ-1 పొలమరశెట్టి దుర్గాప్రసాద్ (24), తండ్రి మంగరాజు, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం., ఏ-2 దాడి ఆదిబాబు (38), వృత్తి డ్రైవర్, తండ్రి వెంకటరమణ, జంగాల వీధి, నాగులాపల్లి గ్రామం, మునగపాక మండలాలకు చెందిన వీరిపై జైలు శిక్ష విధిస్తూ తీర్ప వచ్చిందని అన్నారు. ​ఈ కేసులో సమగ్ర దర్యాప్తుతో నేరాన్ని నిరూపించిన దర్యాప్తు అధికారి ఎస్ఐ ఉపేంద్ర, ప్రాసిక్యూషన్‌ను సమర్థవంతంగా నడిపించిన ఏపీపీ అశ్విని, కోర్టు లైజన్ సిబ్బంది లావణ్యలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.

దర్యాప్తు అధికారి, ఏపీపీలను అభినందించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్

యలమంచిలి : పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బంగారం చోరీ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష వితించిందని అన్నారు. యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 04/2024, సెక్షన్ 454, 380 ఐపీసీ కింద నమోదైన కేసులో ఎస్ఐ ఉపేంద్ర సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. యలమంచిలి ఏజేఎఫ్సీఎం న్యాయస్థానంలో సీసీ నెంబర్ 564/2025 పై విచారణ ముగిసిందని తెలిపారు. దర్యాప్తు అధికారి సమర్పించిన ఆధారాలు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నేరం రుజువు కావడంతో సెక్షన్ 428 సీఆర్‌పీసీ కింద ఇద్దరు ముద్దాయిలకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఏ-1 పొలమరశెట్టి దుర్గాప్రసాద్ (24), తండ్రి మంగరాజు, రాజుపేట గ్రామం, కోటవురట్ల మండలం., ఏ-2 దాడి ఆదిబాబు (38), వృత్తి డ్రైవర్, తండ్రి వెంకటరమణ, జంగాల వీధి, నాగులాపల్లి గ్రామం, మునగపాక మండలాలకు చెందిన వీరిపై జైలు శిక్ష విధిస్తూ తీర్ప వచ్చిందని అన్నారు. ​ఈ కేసులో సమగ్ర దర్యాప్తుతో నేరాన్ని నిరూపించిన దర్యాప్తు అధికారి ఎస్ఐ ఉపేంద్ర, ప్రాసిక్యూషన్‌ను సమర్థవంతంగా నడిపించిన ఏపీపీ అశ్విని, కోర్టు లైజన్ సిబ్బంది లావణ్యలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.