Tuesday, 8 September 2026
  • Home  
  • ఫిన్లాండ్ పర్యటన ముగించుకొచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుడు బాలుని అభినందించిన డి.ఇ.ఓ
- తిరుపతి

ఫిన్లాండ్ పర్యటన ముగించుకొచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుడు బాలుని అభినందించిన డి.ఇ.ఓ

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 08, (పున్నమి న్యూస్): ఫిన్లాండ్ దేశంలో విద్యా విధానంపై అధ్యయన పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రమణ్యంను తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి (డి.ఇ.ఓ) కె.వి.యన్.కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం, ఫిన్లాండ్‌లో సాగిన విద్యా బోధన విశేషాలను డి.ఇ.ఓకు వివరించారు. అక్కడ ఒత్తిడి లేని విద్యా విధానం, విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేలా సాగే ఆనంద అభ్యసన పద్ధతులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఈ విద్యా సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక పాఠ్యపుస్తకాల్లో తాను రాసిన గేయాలు పాఠ్యాంశాలుగా ముద్రితమవ్వడంపై డి.ఇ.ఓకు ఆ పుస్తకాలను చూపించి సంతోషాన్ని పంచుకున్నారు. అందులోని గేయాలను చదివిన డి.ఇ.ఓ కుమార్, ముఖ్యంగా “ఆటంటే మా కిష్టం” అనే గేయం ద్వారా పాత తరం నాటి గ్రామీణ ఆటలను గుర్తుచేస్తూ నేటి తరానికి పరిచయం చేయడం ఎంతో అద్భుతమని కొనియాడారు. బాలసుబ్రమణ్యం సాధించిన ఈ అరుదైన విజయాలు తిరుపతి జిల్లా విద్యా రంగానికే గర్వకారణమని, మున్ముందు జిల్లా ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.