కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటనపై నందలూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందలూరు మండలం వెంకటరాజంపేట గ్రామానికి చెందిన చింతకాయల వెంకట రత్నం (40), తండ్రి పెంచలయ్య, గత 20 సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్య సమస్యలు, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. మూర్ఛ వచ్చినప్పుడల్లా మానసిక స్థిమితం కోల్పోయి అటూ ఇటూ తిరుగుతుండేవాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం సుమారు 9 గంటల సమయంలో వెంకటరాజంపేటలోని విజయకుమార్ పొలం సమీపంలోని మెటల్ రోడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ తన నడుముకు సన్నని బైండింగ్ వైరు చుట్టుకుని, దానికి రాయిని కట్టి చింతకాయపల్లి వైపు నుంచి వచ్చే ప్రధాన విద్యుత్ లైన్‌పైకి విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి అన్న చింతకాయల వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందలూరు పోలీసులు క్రైం నంబర్ 70/2026 కింద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి వివరాలు:
పేరు: చింతకాయల వెంకట రత్నం (40)
తండ్రి పేరు: పెంచలయ్య
కులం: ముదిరాజు
చిరునామా: వెంకటరాజంపేట గ్రామం, నందలూరు మండలం, కడప జిల్లా.


