సంగం ఆగస్టు 4 ( పున్నమి ) నెల్లూరు జిల్లా, (కో ఆర్డినేటర్ విజయ్ )
సంగం బ్యారేజి వైపు నుండి బస్ స్టాండ్ వైపు వెళ్తున్న ఓ భారీ లారీ ఎత్తు ఎక్కే క్రమంలో ఆగిపోగా, పక్కనుంచి వెళ్లేందుకు యత్నించిన ఇసుక ట్రాక్టర్ లారీకి తగిలి ఇరుక్కుపోయింది. దీంతో సంగం బస్ స్టాండ్ సెంటర్ లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సె భోజ్యా నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని, భారీ క్రేన్ మరియు జేసీబీ సహాయంతో లారీ, ట్రాక్టర్లను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అయితే రహదారి గోతులమయంగా మారడం వల్లే ఇటువంటి.సమస్యలు పునరావృతం అవుతున్నాయని, సంబంధిత అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

