Saturday, 22 August 2026
  • Home  
  • ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసిపి అండగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలు ఆపి, సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి జమ్మలమడక నాగమణి
- కాకినాడ

ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసిపి అండగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలు ఆపి, సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి జమ్మలమడక నాగమణి

కాకినాడ.ఆగస్ట్ 22 : కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని లేదా కూటమి నాయకులను ఏ విషయంలోనైనా ప్రశ్నిస్తే “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, సస్పెన్షన్లతో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాల్లో చేరే నాటికి లేని టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని (కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన టీచర్లు) అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న లక్షలాది మంది సీనియర్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే వారు చేసిన నేరమా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఐఆర్, మెరుగైన పిఆర్సి , అమలు చేయకపోగా, పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సి బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ , మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు దాదాపు రూ. 35,000 కోట్ల నుండి రూ. 40,000 కోట్ల వరకు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ధ్వజమెత్తారు.తమ న్యాయమైన హక్కులు, బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, టీచర్లపై కక్షసాధింపు చర్యలు తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, వారికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా నిలిచి, వారి పోరాటానికి మద్దతుగా న్యాయపరమైన, రాజకీయ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసీపీ అండగా ఉంటుందని జమ్మలమడక నాగమణి అన్నారు.

కాకినాడ.ఆగస్ట్ 22 :

కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని లేదా కూటమి నాయకులను ఏ విషయంలోనైనా ప్రశ్నిస్తే “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, సస్పెన్షన్లతో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాల్లో చేరే నాటికి లేని టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని (కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన టీచర్లు) అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న లక్షలాది మంది సీనియర్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే వారు చేసిన నేరమా అని సూటిగా ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఐఆర్, మెరుగైన పిఆర్సి , అమలు చేయకపోగా, పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సి బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ , మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు దాదాపు రూ. 35,000 కోట్ల నుండి రూ. 40,000 కోట్ల వరకు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ధ్వజమెత్తారు.తమ న్యాయమైన హక్కులు, బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, టీచర్లపై కక్షసాధింపు చర్యలు తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, వారికి క్షమాపణలు చెప్పాలని,
లేని పక్షంలో అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా నిలిచి, వారి పోరాటానికి మద్దతుగా న్యాయపరమైన, రాజకీయ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసీపీ అండగా ఉంటుందని జమ్మలమడక నాగమణి అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.