బీసీ కాలనీలోని బీవీఆర్ వాటర్ ప్లాంట్‌పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్లాంట్ కార్యకలాపాలతో పాఠశాల విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్అండ్బీ రోడ్డును అనుమతులు లేకుండా వినియోగిస్తున్నారని, వ్యర్థజలాలు పాఠశాల వైపు విడుదలవుతున్నాయని ఆరోపించారు. దీంతో నీరు నిలిచి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. నీటి వాహనాలు, ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు పాఠశాల గేటు వద్ద నిలిపివేయడంతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై విద్యాశాఖ, పంచాయతీ, ఆర్అండ్బీ, కాలుష్య నియంత్రణ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై ప్లాంట్ యజమాని, సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది



