Saturday, 3 October 2026
  • Home  
  • ప్రమాదపు అంచున వాటర్ ప్లాంట్..!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదపు అంచున వాటర్ ప్లాంట్..!

బీసీ కాలనీలోని బీవీఆర్ వాటర్ ప్లాంట్‌పై స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్లాంట్ కార్యకలాపాలతో పాఠశాల విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్డును అనుమతులు లేకుండా వినియోగిస్తున్నారని, వ్యర్థజలాలు పాఠశాల వైపు విడుదలవుతున్నాయని ఆరోపించారు. దీంతో నీరు నిలిచి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. నీటి వాహనాలు, ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు పాఠశాల గేటు వద్ద నిలిపివేయడంతో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై విద్యాశాఖ, పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, కాలుష్య నియంత్రణ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోపణలపై ప్లాంట్ యజమాని, సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.