పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 2న గ్రామసభలో బెల్ట్ షాపుల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు ఈ తీర్మానాన్ని ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని గ్రామ సర్పంచ్ రాగుల రాజిరెడ్డి తెలియజేశారు గ్రామంలో ప్రజా సంక్షేమం యువత భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు



