*జగపతినగరంలో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు – హాజరై చిన్నారులకు బోనాలు ఎత్తిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*
*కాకినాడ , కిర్లంపూడి, పున్నమి ప్రతినిధి, ఆగస్టు 26:*
కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో పైడితల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగుతూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ జాతరకు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. మహిళలకు స్వయంగా బోనాలు నెత్తిన పెట్టి జాతరలో పాల్గొని సందడి చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ -*
పైడితల్లి అమ్మవారి కృపాకటాక్షాలతో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి.గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇలాంటి జాతరలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం. మహిళలు భక్తిశ్రద్ధలతో జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, తూము కుమార్, కుర్ల చినబాబు, కాళ్ళ వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్ కర్రీ సూర్యకుమార్, ఆలయ కమిటీ సభ్యులు దాడి బాబి, శరకణం శివ, చదరం ఆదిబాబు, రాపేటి ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.


