Wednesday, 2 September 2026
  • Home  
  • పేరవరంలో టీడీపీ–జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి 250 మంది చేరిక
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పేరవరంలో టీడీపీ–జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి 250 మంది చేరిక

పేరవరంలో టీడీపీ–జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి 250 మంది చేరిక పేరవరం నుంచి మొదలైన రాజకీయ మార్పు.. కొత్తపేట నియోజకవర్గం అంతా విస్తరిస్తుంది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. మాజీ మంత్రివర్యులు పేర్ని నాని ఆధ్వర్యంలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆత్రేయపురం మండల మాజీ ఎంపీపీ, పేరవరం గ్రామ మాజీ సర్పంచ్ బెజవాడ హిమబిందు సతీష్ దంపతులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. వారితో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై తమకు ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతకు అందిన ప్రయోజనాలను ప్రజలు మరచిపోలేదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని.. ప్రజల విశ్వాసమే శాశ్వతమని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. పేరవరం నుంచి మొదలైన ఈ చేరికల పరంపర రాబోయే రోజుల్లో ఆత్రేయపురం మండలం మొత్తం విస్తరించనుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. టీడీపీ–జనసేన కూటమికి రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పవని, ప్రజా మద్దతు ఎవరి వైపు ఉందో ఈ భారీ చేరికలే స్పష్టంగా తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

పేరవరంలో టీడీపీ–జనసేనకు భారీ షాక్.. వైఎస్సార్‌సీపీలోకి 250 మంది చేరిక

పేరవరం నుంచి మొదలైన రాజకీయ మార్పు.. కొత్తపేట నియోజకవర్గం అంతా విస్తరిస్తుంది

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ బలం చేకూరింది. మాజీ మంత్రివర్యులు పేర్ని నాని ఆధ్వర్యంలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 250 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆత్రేయపురం మండల మాజీ ఎంపీపీ, పేరవరం గ్రామ మాజీ సర్పంచ్ బెజవాడ హిమబిందు సతీష్ దంపతులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. వారితో పాటు గ్రామానికి చెందిన పలువురు నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై తమకు ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నామని తెలిపారు. ప్రజల కోసం పనిచేసే నాయకత్వానికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతకు అందిన ప్రయోజనాలను ప్రజలు మరచిపోలేదని అన్నారు.

అధికారం శాశ్వతం కాదని.. ప్రజల విశ్వాసమే శాశ్వతమని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు.

పేరవరం నుంచి మొదలైన ఈ చేరికల పరంపర రాబోయే రోజుల్లో ఆత్రేయపురం మండలం మొత్తం విస్తరించనుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. టీడీపీ–జనసేన కూటమికి రాజకీయంగా ఎదురుదెబ్బలు తప్పవని, ప్రజా మద్దతు ఎవరి వైపు ఉందో ఈ భారీ చేరికలే స్పష్టంగా తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.