పేదల ఇళ్ల కూల్చివేతలపై మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక
నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ పాత చెక్పోస్ట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన నివసిస్తున్న పేద కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధితులను పరామర్శించారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా ఖాళీ చేయించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిజంగా అభివృద్ధి కోరుకుంటే పేదలకు ఇదే ప్రాంతంలో స్థిర నివాసాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పేదల ఇళ్ల కూల్చివేతలపై మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక
పేదల ఇళ్ల కూల్చివేతలపై మంత్రి నారాయణకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ పాత చెక్పోస్ట్ సెంటర్ జాఫర్ సాహెబ్ కాలువ పక్కన నివసిస్తున్న పేద కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధితులను పరామర్శించారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధితులకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించకుండా ఖాళీ చేయించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిజంగా అభివృద్ధి కోరుకుంటే పేదలకు ఇదే ప్రాంతంలో స్థిర నివాసాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

