Monday, 17 August 2026
  • Home  
  • పేద ,ధనిక భేదం లేకుండా వైద్యం అందించడమే మన లక్ష్యం కావాలి .. అనిల్ కుమార్ జాదవ్ సూపరిండెంట్
- నిర్మల్

పేద ,ధనిక భేదం లేకుండా వైద్యం అందించడమే మన లక్ష్యం కావాలి .. అనిల్ కుమార్ జాదవ్ సూపరిండెంట్

బైంసా ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి పేద, ధనికా భేదం లేకుండా అందరికీ సమాన వైద్యం అందించడమే మన లక్ష్యం కావాలని ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నమంటే దీని వెనుక ఎంతోమంది అమరవీరుల త్యాగం ఉందని గుర్తు చేశారు. త్యాగధనులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడమంటే వారికి నిజమైన నివాళులు అర్పించడమే అవుతుంది. స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు. ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా, చదువుకుని, గౌరవంగా జీవించడమే నిజమైన స్వాతంత్ర్యం అవుతుంది. ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి కుటుంబంగా భావించి మనమందరం పని చేస్తున్నాం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 24 గంటలు వైద్యం అందించడమే మా లక్ష్యం. ఇదే మా దేశానికి మేము చేసే సేవ. మన ప్రభుత్వము రోగులకు అవసరమైన చికిత్స మరియు వైద్యం అందించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అందుచేత ఈరోజు మనమందరం కలిసి “ఆరోగ్యవంతమైన భారత్ – అభివృద్ధి చెందిన భారత్” కు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు. ఇందుకు అనుగుణంగా పనిచేసి రోగులకు చేరువవుదాం అన్నారు. కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామ పెద్దలకు, అధికారులకు, గ్రామస్తులకు, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

బైంసా ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి
పేద, ధనికా భేదం లేకుండా అందరికీ సమాన వైద్యం అందించడమే మన లక్ష్యం కావాలని ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈరోజు మనం గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నమంటే దీని వెనుక ఎంతోమంది అమరవీరుల త్యాగం ఉందని గుర్తు చేశారు. త్యాగధనులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడమంటే వారికి నిజమైన నివాళులు అర్పించడమే అవుతుంది.

స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు. ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా, చదువుకుని, గౌరవంగా జీవించడమే నిజమైన స్వాతంత్ర్యం అవుతుంది.

ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి కుటుంబంగా భావించి మనమందరం పని చేస్తున్నాం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 24 గంటలు వైద్యం అందించడమే మా లక్ష్యం. ఇదే మా దేశానికి మేము చేసే సేవ. మన ప్రభుత్వము రోగులకు అవసరమైన చికిత్స మరియు వైద్యం అందించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అందుచేత ఈరోజు మనమందరం కలిసి “ఆరోగ్యవంతమైన భారత్ – అభివృద్ధి చెందిన భారత్” కు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు. ఇందుకు అనుగుణంగా పనిచేసి రోగులకు చేరువవుదాం అన్నారు. కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసిన గ్రామ పెద్దలకు, అధికారులకు, గ్రామస్తులకు, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.