కళ్లేపల్లిలో వికసించిన సంక్షేమ కాంతి
కూటమి నాయకత్వంలో వేగంగా రాష్ట్ర అభివృద్ధి: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
విజయనగరం జిల్లా పున్నమి ప్రతినిధి రమణ, ఆగస్టు 12.
ఎల్.కోట, మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ గత రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన కీలక విజయాలను, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను గ్రామస్థులకు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే లలిత కుమారికి మహిళలు, స్థానికులు హారతులు పడుతూ ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రజలతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


