నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 05 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: నిర్మల్ పట్టణంలోని మన నిర్మల్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం టీఎన్జీవో భవన్లో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెయింటర్ల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.
సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు మర్రి పెద్దల రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీన నిర్వహించే సంఘ సమావేశానికి సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. లేబర్ కార్డులు లేని పెయింటర్ల కోసం యూనియన్ తరఫున 40 మందికి లేబర్ కార్డుల దరఖాస్తులను మీ సేవ కేంద్రం ద్వారా సమర్పించినట్లు తెలిపారు. ప్రతి పెయింటర్ లేబర్ కార్డు పొందడంతో పాటు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి కత్తెరపాక శంకర్ మాట్లాడుతూ ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పథకంలో చేరాలని కోరారు. భవిష్యత్‌లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో యూనియన్ క్యాషియర్ దాసర యాదగిరి, బోనగిరి లక్ష్మణ్, కత్తి విష్ణు, ఉప్పరి రవి, నరేష్, పులింటి రాజ్‌కుమార్, రవి, దశరథ్ తదితర పెయింటర్లు పాల్గొన్నారు.

పెయింటర్స్ సంక్షేమమే లక్ష్యంగా సంఘం కృషి 40 మంది పెయింటర్లకు లేబర్ కార్డుల కోసం దరఖాస్తు
నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 05 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: నిర్మల్ పట్టణంలోని మన నిర్మల్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం టీఎన్జీవో భవన్లో సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెయింటర్ల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు మర్రి పెద్దల రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీన నిర్వహించే సంఘ సమావేశానికి సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. లేబర్ కార్డులు లేని పెయింటర్ల కోసం యూనియన్ తరఫున 40 మందికి లేబర్ కార్డుల దరఖాస్తులను మీ సేవ కేంద్రం ద్వారా సమర్పించినట్లు తెలిపారు. ప్రతి పెయింటర్ లేబర్ కార్డు పొందడంతో పాటు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కత్తెరపాక శంకర్ మాట్లాడుతూ ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పథకంలో చేరాలని కోరారు. భవిష్యత్‌లో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ క్యాషియర్ దాసర యాదగిరి, బోనగిరి లక్ష్మణ్, కత్తి విష్ణు, ఉప్పరి రవి, నరేష్, పులింటి రాజ్‌కుమార్, రవి, దశరథ్ తదితర పెయింటర్లు పాల్గొన్నారు.

