Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కుర్రపల్లిలో శ్రీరామచంద్ర స్వామివారి మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కుర్రపల్లిలో శ్రీరామచంద్ర స్వామివారి మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీలో శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామచంద్ర స్వామివారి శిఖర కలశ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.
  • కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
  • ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీలో శ్రీ సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామచంద్ర స్వామివారి శిఖర కలశ ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా జీవించాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు వెల్లివిరియాలని స్వామివారిని వేడుకున్నారు. శ్రీరామచంద్ర స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *