నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘NPS స్వాస్థ్య’అనే సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది. రిటైర్మెంట్ పొదుపుతో పాటు అత్యవసర వైద్య ఖర్చులకు సూపర్ టాప్-అప్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
కీలక ముఖ్యాంశాలు:
ప్రారంభ తేదీ: అక్టోబర్ 1, 2026 (NPS దివాస్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించే అవకాశం).
ఫ్యామిలీ కవరేజ్: భార్యాభర్తలు + ఇద్దరు పిల్లలకు ఫ్యామిలీ ఫ్లోటర్ రక్షణ (తల్లిదండ్రులకు వర్తించదు).
వయోపరిమితి:18 నుంచి 70 ఏళ్లు (గరిష్టంగా 85 ఏళ్ల వరకు రెన్యూవల్ వెసులుబాటు).
ఇన్సూరెన్స్ కవరేజ్:ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు సూపర్ టాప్-అప్ కవర్ లభిస్తుంది.
చెల్లింపుల వివరాలు:మొదటి ఏడాది హెల్త్ ప్రీమియం + రూ. 200 వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ + కనీస డిపాజిట్ రూ. 1,000 తో ఖాతా ప్రారంభం.ఆ తర్వాత కనీస పెట్టుబడి కేవలం రూ. 10 మాత్రమే అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఖాతాదారుడు తన కాంట్రిబ్యూషన్ నుంచి 25% వరకు పాక్షిక విత్‌డ్రాయల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.


