పెడపర్తి, సెప్టెంబరు 27 (పున్నమి ప్రతినిధి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పెడపర్తిలో వీక్షించారు. బీజేపీ నాయకుడు సబ్బెళ్ల సత్తిరెడ్డి (ఎస్‌ఎస్) నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ప్రసంగంలోని అంశాలను నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ అంశాలపై ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలను వారు పరిశీలించారు.



