నెల్లూరులో తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో “థాంక్యూ సీఎం సార్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు చెవుల రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు, దేవినేని మాల్యాద్రి, పద్మయ్య నాయుడు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్ వరం: సీఎంకు ఉపాధ్యాయుల కృతజ్ఞతాభివందనం కార్యక్రమం ఘనంగా
నెల్లూరులో తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో “థాంక్యూ సీఎం సార్” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు చెవుల రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు, దేవినేని మాల్యాద్రి, పద్మయ్య నాయుడు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

