Monday, 4 May 2026
  • Home  
  • పాఠశాల బస్సులకు ‘ఫిట్‌నెస్’ ఉంటేనే అనుమతి: ఆర్‌టీఓ దామోదర్ రెడ్డి
- తిరుపతి

పాఠశాల బస్సులకు ‘ఫిట్‌నెస్’ ఉంటేనే అనుమతి: ఆర్‌టీఓ దామోదర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి, పరిసర ప్రాంతాలలో విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాల బస్సులు తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని ఆర్‌టీఓ దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల యాజమాన్యాలు తమ వాహనాలకు సకాలంలో మరమ్మతులు చేయించుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. తనిఖీ చేసిన 10 వాహనాలలో మూడు వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామని, విద్యా సంవత్సరం ప్రారంభం లోపే వాటికి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కొత్త వాహనాలకు రెండేళ్ల వరకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ, మధ్యలో తలెత్తే రిపేర్లను ఎప్పటికప్పుడు సరిచేయించుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పాఠశాల యాజమాన్యాలను హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.