Tuesday, 29 September 2026
  • Home  
  • పల్లగుట్ట మైనింగ్ అనుమతులను ప్రభుత్వ రద్దు చేయాలి
- రాజన్న సిరిసిల్ల

పల్లగుట్ట మైనింగ్ అనుమతులను ప్రభుత్వ రద్దు చేయాలి

పల్లగుట్ట మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి గూడూరు గ్రామస్థుల డిమాండ్ రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి): ముస్తాబాద్ మండలం గూడూరు–నామాపూర్ సరిహద్దులోని పల్లగుట్టపై మైనింగ్, క్వారీ కార్యకలాపాలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సామూహికంగా సంతకాలు సేకరించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. ఒకవైపు ప్రభుత్వం ప్రకృతిని కాపాడాలని, మొక్కలు నాటి వృక్షాలను పెంచాలని చెబుతుండగా, మరోవైపు పల్లగుట్టపై చెట్లను నరికివేసి గుట్టను ధ్వంసం చేసేలా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పల్లగుట్ట గ్రామ ప్రజల జీవనోపాధికి, పశువుల మేతకు, భూగర్భ జలాల పరిరక్షణకు కీలకమని తెలిపారు. సీడబ్ల్యూఎఫ్‌ఐ కార్యవర్గ సభ్యులు గీస బిక్షపతి మాట్లాడుతూ అనుమతులు రద్దు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎదురు శ్రీనివాస్, చెక్కపల్లి లక్ష్మి, చెరుకు ఎల్లం, వంగూరి ఆంజనేయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పల్లగుట్ట మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి

గూడూరు గ్రామస్థుల డిమాండ్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి):
ముస్తాబాద్ మండలం గూడూరు–నామాపూర్ సరిహద్దులోని పల్లగుట్టపై మైనింగ్, క్వారీ కార్యకలాపాలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సామూహికంగా సంతకాలు సేకరించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. ఒకవైపు ప్రభుత్వం ప్రకృతిని కాపాడాలని, మొక్కలు నాటి వృక్షాలను పెంచాలని చెబుతుండగా, మరోవైపు పల్లగుట్టపై చెట్లను నరికివేసి గుట్టను ధ్వంసం చేసేలా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. పల్లగుట్ట గ్రామ ప్రజల జీవనోపాధికి, పశువుల మేతకు, భూగర్భ జలాల పరిరక్షణకు కీలకమని తెలిపారు. సీడబ్ల్యూఎఫ్‌ఐ కార్యవర్గ సభ్యులు గీస బిక్షపతి మాట్లాడుతూ అనుమతులు రద్దు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎదురు శ్రీనివాస్, చెక్కపల్లి లక్ష్మి, చెరుకు ఎల్లం, వంగూరి ఆంజనేయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.