Tuesday, 29 September 2026
  • Home  
  • యలమంచిలి మండలంలో ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతం.. 51 పాఠశాలల్లో నూతన కమిటీలు
- అనకాపల్లి

యలమంచిలి మండలంలో ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతం.. 51 పాఠశాలల్లో నూతన కమిటీలు

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) యలమంచిలి: యలమంచిలి మండలంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిశాయి. మండల పరిధిలోని మొత్తం 51 పాఠశాలల్లో నూతన ఎస్‌ఎంసీ కమిటీలు కొలువుదీరాయి. వీటిలో 36 ప్రాథమిక పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాల ఉన్నాయి. మరో పాఠశాలలో విద్యార్థులు లేరు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో కమిటీ సభ్యులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నూతన కమిటీలు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యార్థుల సమగ్ర వికాసంపై దృష్టి సారించనున్నాయి. ఎన్నికలను ఎంఈఓలు సూర్య ప్రకాష్‌, అరుణ్‌కుమార్‌, పరిశీలకులు రాధాకృష్ణ, సీఆర్‌పీ కిషోర్‌కుమార్‌ పర్యవేక్షించారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )

యలమంచిలి: యలమంచిలి మండలంలోని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ముగిశాయి. మండల పరిధిలోని మొత్తం 51 పాఠశాలల్లో నూతన ఎస్‌ఎంసీ కమిటీలు కొలువుదీరాయి. వీటిలో 36 ప్రాథమిక పాఠశాలలు, 11 ఉన్నత పాఠశాలలు, 2 ప్రాథమికోన్నత పాఠశాలలు, ఒక హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాల ఉన్నాయి. మరో పాఠశాలలో విద్యార్థులు లేరు. ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో కమిటీ సభ్యులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నూతన కమిటీలు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యార్థుల సమగ్ర వికాసంపై దృష్టి సారించనున్నాయి. ఎన్నికలను ఎంఈఓలు సూర్య ప్రకాష్‌, అరుణ్‌కుమార్‌, పరిశీలకులు రాధాకృష్ణ, సీఆర్‌పీ కిషోర్‌కుమార్‌ పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.