బంటుమిల్లి మండలం డీసీ పరిధిలోని పంట కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి రైతుల ప్రశంసలు అందుకుంటున్నారు డీసీ చైర్మన్ బొర్రా కాశీ. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు చేరేలా కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు.
కాలువల్లో కలుపు మొక్కలు, గుర్రపుడెక్క, తూడు విస్తరించకుండా కలుపు మందును పిచికారీ చేయిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగిస్తున్నారు.
పంట కాలువలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో బొర్రా కాశీ అహర్నిశలు కృషి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందిస్తూ సాగునీటి వ్యవస్థను మెరుగుపర్చడంలో విశేష కృషి చేస్తున్న డీసీ చైర్మన్ బొర్రా కాశీకి పలువురు రైతులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Uploaded Video:


