Saturday, 5 September 2026
  • Home  
  • నేరేడ్‌మెట్ కాంగ్రెస్‌లోకి తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి
- మేడ్చల్ – మల్కాజిగిరి

నేరేడ్‌మెట్ కాంగ్రెస్‌లోకి తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి

హైదరాబాద్ / మేడ్చల్ / నేరేడ్‌మెట్: ప్రజానాయకుడు మైనంపల్లి హనుమంత్ రావు నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో నేరేడ్‌మెట్ తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ​ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరించడం మైనంపల్లి హనుమంత్ రావు గారి ప్రత్యేకత అని కొనియాడారు. పదవులతో సంబంధం లేకుండా నిరుపేదలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండే ఆయన నాయకత్వ శైలి తనను ఎంతో ఆకట్టుకుందని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ​మైనంపల్లి హనుమంత్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తానని, నేరేడ్‌మెట్ డివిజన్‌లో పార్టీ బలోపేతానికి పూర్తి నిబద్ధతతో శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ​రిపోర్టింగ్: సందీప్, పున్నమి రిపోర్టర్, మేడ్చల్ జిల్లా

హైదరాబాద్ / మేడ్చల్ / నేరేడ్‌మెట్:
ప్రజానాయకుడు మైనంపల్లి హనుమంత్ రావు నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో నేరేడ్‌మెట్ తాజా మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
​ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరించడం మైనంపల్లి హనుమంత్ రావు గారి ప్రత్యేకత అని కొనియాడారు. పదవులతో సంబంధం లేకుండా నిరుపేదలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండే ఆయన నాయకత్వ శైలి తనను ఎంతో ఆకట్టుకుందని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
​మైనంపల్లి హనుమంత్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తానని, నేరేడ్‌మెట్ డివిజన్‌లో పార్టీ బలోపేతానికి పూర్తి నిబద్ధతతో శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.
​రిపోర్టింగ్: సందీప్, పున్నమి రిపోర్టర్, మేడ్చల్ జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.