ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ప్రముఖ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ నేడు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఆకాశవాణితో పాటు దూరదర్శన్, వివిధ టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ వేదికలు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ వివిధ సామాజిక, జాతీయ, అభివృద్ధి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులు, వినూత్న కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని వీక్షించాలని బీజేపీ నాయకులు కోరారు.



