నెల్లూరు సిటీలో మహానాడు ఏర్పాట్ల పరిశీలన.. హైబ్రిడ్ విధానంలో ఘనంగా నిర్వహణ
నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి క్లస్టర్‌లో ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి Narendra Modi పిలుపు మేరకు ఇంధన పొదుపు దృష్ట్యా నెల్లూరులో ప్రత్యక్ష మహానాడును రద్దు చేసినట్లు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంలో ఇంధన సమస్య తలెత్తే అవకాశాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. బుధ, గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో మహానాడు జరుగుతుందని, కీలక తీర్మానాలతో కార్యకర్తలకు ఇది పెద్ద పండుగగా నిలుస్తుందని పేర్కొన్నారు.

నెల్లూరు సిటీలో మహానాడు ఏర్పాట్ల పరిశీలన.. హైబ్రిడ్ విధానంలో ఘనంగా నిర్వహణ
నెల్లూరు సిటీలో మహానాడు ఏర్పాట్ల పరిశీలన.. హైబ్రిడ్ విధానంలో ఘనంగా నిర్వహణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి క్లస్టర్‌లో ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేస్తూ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి Narendra Modi పిలుపు మేరకు ఇంధన పొదుపు దృష్ట్యా నెల్లూరులో ప్రత్యక్ష మహానాడును రద్దు చేసినట్లు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల దేశంలో ఇంధన సమస్య తలెత్తే అవకాశాల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. బుధ, గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో వర్చువల్ విధానంలో మహానాడు జరుగుతుందని, కీలక తీర్మానాలతో కార్యకర్తలకు ఇది పెద్ద పండుగగా నిలుస్తుందని పేర్కొన్నారు.

