Tuesday, 23 June 2026
  • Home  
  • నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అద్భుతం : విజయవంతంగా గర్భిణికి హైరిస్క్ ఆపరేషన్.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అద్భుతం : విజయవంతంగా గర్భిణికి హైరిస్క్ ఆపరేషన్.

అత్యంత ప్రమాదకరమైన, సంక్షిష్టమైన గర్భాధారణ కేసులలో కూడా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ, వైద్య రంగంలో ప్రజల నమ్మకాన్ని నెలబెట్టుకుంటుందని మరోసారి రుజువైంది. మొదటి సారి గర్భం దాల్చిన ఒక మహిళకు సంబంధించి అరుదైన, అత్యంత ప్రమాదకరమైన 35 వారాల ముగ్గురు పిల్లల గర్భాధారణను విజయవంతంగా నిర్వహించింది. హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం ఈ ప్రక్రియ ద్వారా ముగ్గురు ఆరోగ్యకరమైన శిశువులు సురక్షితంగా జన్మించారు. సాధారణంగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా అరుదు. 8వేల మంది తల్లులలో ఒకరికి మాత్రమే ఈ తరహాలో ఒకే కాన్పులో ముగ్గురు జన్మిస్తుంటారు. ఈ మహిళకు గర్భాధారణ మధుమేహం ఉండటంతో ఈ కేసు సవాలుగా మారింది. అయినప్పటికీ వైద్య బృందం అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షణ, సమగ్ర చికిత్స, ఖచ్చితమైన శస్త్ర చికిత్త ప్రణాళికతో విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి తల్లి నుంచి ముగ్గురు ఆరోగ్యవంతమైన శిశువులను ప్రసవింపజేశారు. ప్రసవానికి ముందు తల్లికి క్రమం తప్పకుండా ఆల్ట్రాసౌండ్ పరీక్షలు, పిండం ఎదుగుదల పర్యవేక్షణ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఖచ్చితంగా నియంత్రించడం వంటివి చేస్తూ డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నేతృత్వంలో అనస్థీషియా వైద్యులు, ఫిజీషియన్లు, నియోనాటాలజిస్టులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లీనరీ బృందం సురక్షితమైన ఫలితాన్ని సాధించింది. ప్రస్తుతం తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ ప్రసూతి వైద్యంలో ముగ్గురు పిల్లల గర్భాధారణ అనేది అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని, దానికి తోడు మధుమేహం తోడైతే హైరిస్క్ కేసుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. నిరంతరం పర్యవేక్షణ, 35 వారాల పాటూ గర్భాధారణను విజయవంతంగా పొడిగించి, ముగ్గురు పిల్లలను సురక్షితంగా డెలివరీ చేశామన్నారు. అధునాతన ప్రసూతి నిర్వహణ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉందని డాక్టర్ టి. జి. లక్ష్మిదుర్గ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. రాజశేఖర్ రెడ్డి, డా. రఫీ మరియు యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

అత్యంత ప్రమాదకరమైన, సంక్షిష్టమైన గర్భాధారణ కేసులలో కూడా నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ, వైద్య రంగంలో ప్రజల నమ్మకాన్ని నెలబెట్టుకుంటుందని మరోసారి రుజువైంది. మొదటి సారి గర్భం దాల్చిన ఒక మహిళకు సంబంధించి అరుదైన, అత్యంత ప్రమాదకరమైన 35 వారాల ముగ్గురు పిల్లల గర్భాధారణను విజయవంతంగా నిర్వహించింది. హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నేతృత్వంలోని నిపుణులైన వైద్య బృందం ఈ ప్రక్రియ ద్వారా ముగ్గురు ఆరోగ్యకరమైన శిశువులు సురక్షితంగా జన్మించారు. సాధారణంగా ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా అరుదు. 8వేల మంది తల్లులలో ఒకరికి మాత్రమే ఈ తరహాలో ఒకే కాన్పులో ముగ్గురు జన్మిస్తుంటారు. ఈ మహిళకు గర్భాధారణ మధుమేహం ఉండటంతో ఈ కేసు సవాలుగా మారింది. అయినప్పటికీ వైద్య బృందం అత్యంత జాగ్రత్తతో పర్యవేక్షణ, సమగ్ర చికిత్స, ఖచ్చితమైన శస్త్ర చికిత్త ప్రణాళికతో విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి తల్లి నుంచి ముగ్గురు ఆరోగ్యవంతమైన శిశువులను ప్రసవింపజేశారు.

ప్రసవానికి ముందు తల్లికి క్రమం తప్పకుండా ఆల్ట్రాసౌండ్ పరీక్షలు, పిండం ఎదుగుదల పర్యవేక్షణ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఖచ్చితంగా నియంత్రించడం వంటివి చేస్తూ డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ నేతృత్వంలో అనస్థీషియా వైద్యులు, ఫిజీషియన్లు, నియోనాటాలజిస్టులు, నర్సింగ్ సిబ్బందితో కూడిన మల్టీడిసిప్లీనరీ బృందం సురక్షితమైన ఫలితాన్ని సాధించింది. ప్రస్తుతం తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ టి.జి. లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ ప్రసూతి వైద్యంలో ముగ్గురు పిల్లల గర్భాధారణ అనేది అత్యంత సవాలుతో కూడుకున్న విషయమని, దానికి తోడు మధుమేహం తోడైతే హైరిస్క్ కేసుగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. నిరంతరం పర్యవేక్షణ, 35 వారాల పాటూ గర్భాధారణను విజయవంతంగా పొడిగించి, ముగ్గురు పిల్లలను సురక్షితంగా డెలివరీ చేశామన్నారు. అధునాతన ప్రసూతి నిర్వహణ నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉందని
డాక్టర్ టి. జి. లక్ష్మిదుర్గ వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో ఆమెతో పాటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, చిన్న పిల్లల వైద్య నిపుణులు డా. రాజశేఖర్ రెడ్డి, డా. రఫీ మరియు యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.