ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, వడదెబ్బకు గురయ్యే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నగరంలోని నాలుగు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏసీ గదులు, పడకలను సిద్ధం చేసినట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నరేంద్రసింగ్ తెలిపారు. వీటితో పాటు ఐవీ ఫ్లూయిడ్స్, ఆక్సిజన్ సదుపాయాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు.
అగనంపూడి ఆసుపత్రిలో నాలుగు,
గోపాలపట్నం, భీమిలి, పెందుర్తి ఆసుపత్రుల్లో రెండేసి చొప్పున పడకలు ఏర్పాటు చేశారు.
అలాగే సేవా సంస్థల సహాయంతో రోగులకు మజ్జిగ పంపిణీ కూడా చేస్తున్నట్లు ఆయన వివరించారు.


