అనకాపల్లి జిల్లా, ఆగస్టు 16 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
నర్సీపట్నం మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (AI) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి చి. తలుపులు తెలిపారు.
మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ హిందీ–4, బయాలజీ–1, సోషల్ స్టడీస్–1 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ హైస్కూల్, జడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ నర్సీపట్నం, జడ్పీహెచ్‌ఎస్ పి.బి.పల్లి, జడ్పీహెచ్‌ఎస్ మెయిన్ నర్సీపట్నం, పీబీఎం జడ్పీహెచ్‌ఎస్ వేములపూడి పాఠశాలల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 సాయంత్రం 5 గంటలలోపు నర్సీపట్నం MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు అటెస్టెడ్ సర్టిఫికెట్లు, విద్యార్హతలు, ప్రొఫెషనల్ అర్హతలు, TET, రెసిడెన్స్ తదితర ధ్రువపత్రాలను రెండు సెట్లలో అందజేయాలని సూచించారు.
నర్సీపట్నం మండలంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని, DSC ఎంపిక నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయని MEO తెలిపారు. ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు.

నర్సీపట్నం మండలంలో 6 ఏఐ పోస్టులు.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
అనకాపల్లి జిల్లా, ఆగస్టు 16 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): నర్సీపట్నం మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (AI) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి చి. తలుపులు తెలిపారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్ హిందీ–4, బయాలజీ–1, సోషల్ స్టడీస్–1 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ హైస్కూల్, జడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ నర్సీపట్నం, జడ్పీహెచ్‌ఎస్ పి.బి.పల్లి, జడ్పీహెచ్‌ఎస్ మెయిన్ నర్సీపట్నం, పీబీఎం జడ్పీహెచ్‌ఎస్ వేములపూడి పాఠశాలల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి ఆగస్టు 21 సాయంత్రం 5 గంటలలోపు నర్సీపట్నం MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుతో పాటు అటెస్టెడ్ సర్టిఫికెట్లు, విద్యార్హతలు, ప్రొఫెషనల్ అర్హతలు, TET, రెసిడెన్స్ తదితర ధ్రువపత్రాలను రెండు సెట్లలో అందజేయాలని సూచించారు. నర్సీపట్నం మండలంలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని, DSC ఎంపిక నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయని MEO తెలిపారు. ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా జిల్లా స్థాయిలో జరుగుతుందని స్పష్టం చేశారు.

