తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలోనే అత్యంత కీలకమైన స్వర్ణాక్షరాల రోజని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, విముక్తి లభించాయని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
దేశ సమైక్యత, అఖండత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ & 28వ వార్డు కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు గడ్డం ఆంజనేయులు, నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, దుగ్యాల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు అంబేత్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు, పట్టణ నాయకులు సూత్రపు సరిత, కాసుల నాగేంద్ర బాబు, అల్లం నిఖిల్, ముత్యాల శ్రీనివాస్, సామల ప్రవీణ్ కుమార్, నూనె రంజిత్, అజీమ్, అనిల్, తప్పెట్ల సతీష్, థౌటం నిశాంత్, బ్రహ్మచారి, కాశీనాథం తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

నర్సంపేటలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించిన బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలోనే అత్యంత కీలకమైన స్వర్ణాక్షరాల రోజని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థవంతమైన నాయకత్వంలో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమై తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, విముక్తి లభించాయని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దేశ సమైక్యత, అఖండత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ & 28వ వార్డు కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు గడ్డం ఆంజనేయులు, నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, దుగ్యాల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు అంబేత్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్, ఎర్ర రాజు, పట్టణ నాయకులు సూత్రపు సరిత, కాసుల నాగేంద్ర బాబు, అల్లం నిఖిల్, ముత్యాల శ్రీనివాస్, సామల ప్రవీణ్ కుమార్, నూనె రంజిత్, అజీమ్, అనిల్, తప్పెట్ల సతీష్, థౌటం నిశాంత్, బ్రహ్మచారి, కాశీనాథం తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

