Thursday, 17 September 2026
  • Home  
  • బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్లరేవులో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్లరేవులో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన

హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై ర్యాలీ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా తాళ్ళరేవు గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అపోహలు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన, ప్రోగ్రాం డాక్యుమెంటేషన్ కోఆర్డినేటర్ పి ఎస్ ఆర్ కనకాంబరం,హెల్త్ ప్రోగ్రాం ఆర్గనైజర్ జి చంద్రకళ,కమ్యూనిటీ ఆర్గనైజర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.