Thursday, 13 August 2026
  • Home  
  • డీపీ చాక్లెట్ పరిశ్రమలో ప్రమాదం 👉లారీ ఢీకొని యువ కార్మికుడు మృతి 👉 పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం
- తిరుపతి

డీపీ చాక్లెట్ పరిశ్రమలో ప్రమాదం 👉లారీ ఢీకొని యువ కార్మికుడు మృతి 👉 పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం

✅కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తూ.. ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలలు కన్న ఓ యువకుడి జీవితం ఒక్క క్షణంలో విషాదంగా మారింది. బుధవారం మధ్యాహ్నం కంచరపాలెం సమీపంలోని డీపీ చాక్లెట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు సునీల్ (32) దుర్మరణం చెందాడు. లోడింగ్ సమయంలో ప్రమాదం: ✅బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు గ్రామానికి చెందిన టి. సీనయ్య కుమారుడు సునీల్, డీపీ చాక్లెట్ పరిశ్రమలో స్టోర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం యథావిధిగా విధులకు వచ్చిన సునీల్, లోడింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. 👉లోడింగ్ కోసం వస్తున్న లారీకి రివర్స్‌లో మార్గం చూపిస్తుండగా అదుపుతప్పిన లారీ సునీల్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సునీల్ తుదిశ్వాస విడిచాడు. ఎస్ఐ కావాలన్న కల.. ఒక్క మార్కుతో ఆగిపోయింది: ✅సునీల్‌కు పెద్ద కల ఉండేది. తండ్రి సీనయ్య కూడా కుమారుడిని ఎస్ఐ చేయాలని పట్టుదలగా ఉండేవారు. వ్యవసాయం చేస్తూ వచ్చిన ఆదాయంతో ఏడేళ్ల పాటు వైజాగ్‌లో సునీల్‌కు శిక్షణ ఇప్పించారు. ఎస్ఐ పరీక్షలో ఒక్క మార్కుతో అతను అవకాశాన్ని కోల్పోయాడు. అయినా కుంగిపోలేదు. కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం డీపీ చాక్లెట్ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా చేరాడు. కష్టపడి పనిచేయడంతో నెల రోజుల క్రితమే పర్మనెంట్ ఉద్యోగిగా ఎదిగాడు. “ఇంకా మంచి జీతం వస్తుంది, పిల్లలను బాగా చదివిస్తాను” అని ఇంట్లో చెప్పుకునేవాడు. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం: సునీల్‌కు వివాహమైంది. ఇంట్లో ఐదేళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు, భార్య ఉన్నారు. నెలంతా.. అతను పరిశ్రమకు వెళితేనే ఇల్లు గడిచేది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన సమాచారం తెలియగానే పరిశ్రమ వద్దకు చేరుకున్న భార్య, పిల్లలు .. కుటుంబ సభ్యులు..గ్రామస్తులు,కన్నీరు మున్నీరయ్యారు. “మా నాన్నను తీసుకురండి” అంటూ చిన్నారులు రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెలను కలచివేసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు పరిశ్రమ యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పేదరికంతో పోరాడుతూ, ఉన్నతంగా ఎదగాలని చూసిన ఓ యువకుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో వెస్ట్ వరత్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రూ 3కోట్ల ఎక్స్ గ్రేషియా కు డిమాండ్: ✅పరిశ్రమలో భద్రతా ప్రమాణాల వైఫల్యంతో యువ కార్మికుడు సునీల్ మృతి చెందాడని సిపిఐ సత్యవేడు నియోజకవర్గం కార్యదర్శి చిన్నిరాజ్ ఆరోపించారు. పెద్దదిక్కును కోల్పోయిన కార్మికుని కుటుంబానికి రూ 3కోట్లఎక్స్ గ్రేషియా చెల్లించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని బాధిత కుటుంబ సభ్యుల తరపున డిమాండ్ చేశారు. ఒక్కో బిడ్డపై కోటి రూపాయల చొప్పున 3కోట్ల రూపాయలు ముగ్గురు బిడ్డలపై బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరారు. అయితే పరిశ్రమ యాజమాన్యం మాత్రం స్పందించక పోవడంతో రాత్రి 9 గంటల వరకు నిరసనను కొనసాగించారు. ✅ఆనవాళ్లు చెరిపివేత: పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రమాదం కు సంబంధించి ఆనవాళ్లను చెరిపి వేశారు. యువ కార్మికుడు సునీల్ ను కంటైనర్ లారీ ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగలడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో రక్త ప్రసరణ బారీగా జరిగినట్లు సహచర కార్మికులే చెబుతున్నారు. అయితే పరిశ్రమ యాజమాన్యం అత్యుచాహంతో.. రక్తపు మరకలను నీటితో తుడిపివేయడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ✅పోలీసులు పరిశీలన: ప్రమాదం జరిగిన డీపీ చాక్లేట్ పరిశ్రమను సత్యవేడు సీఐ మురళీ నాయుడు, వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున, సత్యవేడు ఎస్సై సాయినాథ్ చౌదరి, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతంలో ఆనవాళ్ల చెరిపివేత పై సత్యవేడు సీఐ సైతం పరిశ్రమ యాజమాన్యంను ప్రశ్నించారు. ఇలాంటి అత్యుచాహ చర్యలపై కటిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

✅కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తూ.. ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలలు కన్న ఓ యువకుడి జీవితం ఒక్క క్షణంలో విషాదంగా మారింది. బుధవారం మధ్యాహ్నం కంచరపాలెం సమీపంలోని డీపీ చాక్లెట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు సునీల్ (32) దుర్మరణం చెందాడు.

లోడింగ్ సమయంలో ప్రమాదం:

✅బుచ్చినాయుడు కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరు గ్రామానికి చెందిన టి. సీనయ్య కుమారుడు సునీల్, డీపీ చాక్లెట్ పరిశ్రమలో స్టోర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం యథావిధిగా విధులకు వచ్చిన సునీల్, లోడింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.

👉లోడింగ్ కోసం వస్తున్న లారీకి రివర్స్‌లో మార్గం చూపిస్తుండగా అదుపుతప్పిన లారీ సునీల్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సునీల్ తుదిశ్వాస విడిచాడు.

ఎస్ఐ కావాలన్న కల.. ఒక్క మార్కుతో ఆగిపోయింది:
✅సునీల్‌కు పెద్ద కల ఉండేది. తండ్రి సీనయ్య కూడా కుమారుడిని ఎస్ఐ చేయాలని పట్టుదలగా ఉండేవారు. వ్యవసాయం చేస్తూ వచ్చిన ఆదాయంతో ఏడేళ్ల పాటు వైజాగ్‌లో సునీల్‌కు శిక్షణ ఇప్పించారు. ఎస్ఐ పరీక్షలో ఒక్క మార్కుతో అతను అవకాశాన్ని కోల్పోయాడు.
అయినా కుంగిపోలేదు. కుటుంబ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం డీపీ చాక్లెట్ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా చేరాడు. కష్టపడి పనిచేయడంతో నెల రోజుల క్రితమే పర్మనెంట్ ఉద్యోగిగా ఎదిగాడు. “ఇంకా మంచి జీతం వస్తుంది, పిల్లలను బాగా చదివిస్తాను” అని ఇంట్లో చెప్పుకునేవాడు.

పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం:
సునీల్‌కు వివాహమైంది. ఇంట్లో ఐదేళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు, భార్య ఉన్నారు. నెలంతా.. అతను పరిశ్రమకు వెళితేనే ఇల్లు గడిచేది. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది.
ప్రమాదం జరిగిన సమాచారం తెలియగానే పరిశ్రమ వద్దకు చేరుకున్న భార్య, పిల్లలు .. కుటుంబ సభ్యులు..గ్రామస్తులు,కన్నీరు మున్నీరయ్యారు. “మా నాన్నను తీసుకురండి” అంటూ చిన్నారులు రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెలను కలచివేసింది.

స్థానికులు, కుటుంబ సభ్యులు పరిశ్రమ యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
పేదరికంతో పోరాడుతూ, ఉన్నతంగా ఎదగాలని చూసిన ఓ యువకుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో వెస్ట్ వరత్తూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రూ 3కోట్ల ఎక్స్ గ్రేషియా కు డిమాండ్:
✅పరిశ్రమలో భద్రతా ప్రమాణాల వైఫల్యంతో యువ కార్మికుడు సునీల్ మృతి చెందాడని సిపిఐ సత్యవేడు నియోజకవర్గం కార్యదర్శి చిన్నిరాజ్ ఆరోపించారు. పెద్దదిక్కును కోల్పోయిన కార్మికుని కుటుంబానికి రూ 3కోట్లఎక్స్ గ్రేషియా చెల్లించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని బాధిత కుటుంబ సభ్యుల తరపున డిమాండ్ చేశారు. ఒక్కో బిడ్డపై కోటి రూపాయల చొప్పున 3కోట్ల రూపాయలు ముగ్గురు బిడ్డలపై బ్యాంకులో డిపాజిట్ చేయాలని కోరారు. అయితే పరిశ్రమ యాజమాన్యం మాత్రం స్పందించక పోవడంతో రాత్రి 9 గంటల వరకు నిరసనను కొనసాగించారు.

✅ఆనవాళ్లు చెరిపివేత:
పరిశ్రమలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రమాదం కు సంబంధించి ఆనవాళ్లను చెరిపి వేశారు. యువ కార్మికుడు సునీల్ ను కంటైనర్ లారీ ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగలడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో రక్త ప్రసరణ బారీగా జరిగినట్లు సహచర కార్మికులే చెబుతున్నారు. అయితే పరిశ్రమ యాజమాన్యం అత్యుచాహంతో.. రక్తపు మరకలను నీటితో తుడిపివేయడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

✅పోలీసులు పరిశీలన:

ప్రమాదం జరిగిన డీపీ చాక్లేట్ పరిశ్రమను సత్యవేడు సీఐ మురళీ నాయుడు, వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున, సత్యవేడు ఎస్సై సాయినాథ్ చౌదరి, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతంలో ఆనవాళ్ల చెరిపివేత పై సత్యవేడు సీఐ సైతం పరిశ్రమ యాజమాన్యంను ప్రశ్నించారు. ఇలాంటి అత్యుచాహ చర్యలపై కటిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.