Friday, 31 July 2026
  • Home  
  • నకిలీ బంగారంతో బ్యాంకులకు టోకరా.. కారేపల్లిలో ముఠా అరెస్ట్
- ఖమ్మం

నకిలీ బంగారంతో బ్యాంకులకు టోకరా.. కారేపల్లిలో ముఠా అరెస్ట్

ఖమ్మం (పున్నమి న్యూస్) ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు నకిలీ బంగారు ఆభరణాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు కంపెనీలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. సింగరేణి సీఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం, రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా చూపించి రుణాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు గుగులోత్ సునీల్ కుమార్, ముందాడా రాంచందర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, దారవత్ రాకేష్ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి వేర్నా కారు, రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బంగారం కొనుగోలు లేదా తాకట్టు ముందు స్వచ్ఛతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని సీఐ ప్రజలకు సూచించారు.

ఖమ్మం
(పున్నమి న్యూస్)

ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు నకిలీ బంగారు ఆభరణాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు కంపెనీలను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. సింగరేణి సీఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం, రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా చూపించి రుణాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు గుగులోత్ సునీల్ కుమార్, ముందాడా రాంచందర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, దారవత్ రాకేష్ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి వేర్నా కారు, రూ.15 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బంగారం కొనుగోలు లేదా తాకట్టు ముందు స్వచ్ఛతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని సీఐ ప్రజలకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.