నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డుల స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్లు సామాజికవేత్త, వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ తెలిపారు. ప్రజా సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తూ, వార్డుల అభివృద్ధికి కట్టుబడి ఉండే వారికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థిగా నూర్ భాషా పేరును ఆయన ప్రకటించారు. అలాగే పలు వార్డులకు సంబంధించి కౌన్సిలర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మిగిలిన వార్డుల అభ్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని, అవసరాన్ని బట్టి జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని గోళ్ళ రాజేష్ కమిటీ తెలిపింది. ఇప్పటికే తాము పలు సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయంతో పాటు అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు సహకారం అందిస్తున్నామని ఆయన గుర్తుచేశారు.
నంద్యాల 52 వార్డుల్లో అభ్యర్థుల ఎంపికకు గోళ్ళ రాజేష్ సన్నాహాలు