న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్): దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈసారి స్వీయ నమోదు (Self Enumeration) విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. https://se.census.gov.in� వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. మొబైల్ నంబర్‌కు OTP ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేయాలి. నమోదు పూర్తయిన తర్వాత ప్రత్యేక ID ఇవ్వబడుతుంది. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అధికారులు అవసరమైన సహాయం అందిస్తారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందని, ఖచ్చితమైన డేటా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.



