జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో (జూన్ పున్నమి)
దేశంలోనే అత్యధిక సంఖ్యలో పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం మనదే అచ్చు ని సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
కొండాపురం మండలం, గొట్టిగుండాల గ్రామంలో పేద ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి స్వచ్ఛతకు ప్రతీకగా నిర్వహించిన పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా తమ చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సమర్థ నాయకత్వంతో రాష్ట్రంలో సంక్షేమ పాలనకు కొత్త నిర్వచనం ఏర్పడిందని తెలిపారు. ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించాలనే సంకల్పంతో దేశంలోనే అత్యుత్తమ పింఛన్ విధానాన్ని అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వితంతు, వృద్ధాప్య, వికలాంగులు, డయాలసిస్ బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లను పంపిణీ చేస్తూ, సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా వృద్ధులకు ₹4,000, వికలాంగులకు ₹6,000, డయాలసిస్ బాధితులకు ₹10,000, ప్రత్యేక అవసరాలున్న వారికి ₹15,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమేనని సురేష్ స్పష్టం చేశారు.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న వి.పి.ఆర్ అమృతధార కార్యక్రమం ద్వారా గొట్టిగుండాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శుద్ధి చేసిన తాగునీటి వాటర్ ప్లాంట్ను కాకర్ల సురేష్ ప్రారంభించారు.
ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభంతో కలిపి ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం 37 వాటర్ ప్లాంట్లు, నెల్లూరు జిల్లాలో మెత్తం 200 వాటర్ ప్లాంట్ లను ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, కొండాపురం మండలంలోనే ఇప్పటికే 7 వాటర్ ప్లాంట్లను మంజూరు చేసిందని తెలిపారు
సామాజిక సేవా కార్యక్రమాలలో విశిష్టమైన సేవలందిస్తున్న విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన 169 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేసి భరోసా కల్పించినట్లు తెలిపారు.
అలాగే, విపిఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో 47,434 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 26,423 మందికి ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గొట్టిగుండాల గ్రామ పంచాయతీకి వ్యర్థాల సేకరణ మరియు గ్రామ పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో స్వచ్ఛ ట్రాక్టర్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ప్రజా సంక్షేమం, గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ అనే నాలుగు ప్రధాన సూత్రాలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కాకర్ల సురేష్ ఈ సందర్భంగా తెలిపారు.


