శ్రీ కాళహస్తి, జులై 10 : (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ సభ్యులు బిప్లబ్ కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సూచనల మేరకు బీజేపీ నాయకులు ఆలయ అతిథి గృహం వద్ద వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో రాహు, కేతు ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటం మరియు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఆలయ అధికారులు, బీజేపీ నాయకులు సమంచి శ్రీనివాస్, శైలజ, ప్రజ్ఞాశ్రీ, చందు, దీపక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్కు శ్రీకాళహస్తిలో ఘన స్వాగతం