Friday, 22 May 2026
  • Home  
  • తెలంగాణ మహిళా సేవాదళ్ అధ్యక్షురాలిగా పడాల సంగీత నియామకం
- E-పేపర్

తెలంగాణ మహిళా సేవాదళ్ అధ్యక్షురాలిగా పడాల సంగీత నియామకం

తెలంగాణ మహిళా సేవాదళ్ అధ్యక్షురాలిగా పడాల సంగీత నియామకం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : పడాల సంగీత పున్నమి న్యూస్ హైదరాబాద్, మే 22: తెలంగాణ ప్రదేశ్ మహిళా సేవాదళ్ అధ్యక్షురాలిగా పడాల సంగీతను నియమించినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ప్రకటించింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సేవాదళ్ సంస్థను మరింత బలోపేతం చేస్తూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఆమెకు సూచించింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సేవాదళ్ జాతీయ నాయకులు దేవేంద్ర శర్మ తదితరులకు పడాల సంగీత కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు పడాల సంగీతకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ మహిళా సేవాదళ్ అధ్యక్షురాలిగా పడాల సంగీత నియామకం
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : పడాల సంగీత

పున్నమి న్యూస్
హైదరాబాద్, మే 22:
తెలంగాణ ప్రదేశ్ మహిళా సేవాదళ్ అధ్యక్షురాలిగా పడాల సంగీతను నియమించినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ప్రకటించింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
సేవాదళ్ సంస్థను మరింత బలోపేతం చేస్తూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ నాయకత్వం ఆమెకు సూచించింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సేవాదళ్ జాతీయ నాయకులు దేవేంద్ర శర్మ తదితరులకు పడాల సంగీత కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు పడాల సంగీతకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.