రాజమహేంద్రవరం, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు చర్చించారు. సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.





