తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 20:
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తుపాకులగూడెం గ్రామంలో పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదించిన ప్రభుత్వ భూ బ్యాంకులను జాయింట్ కలెక్టర్ కె. మేఘస్వరూప్ బుధవారం పరిశీలించారు. కొవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావుతో కలిసి భూముల స్థితిగతులను పరిశీలిస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూభాగాల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను సమగ్రంగా గుర్తించి, పూర్తి స్థాయి రికార్డులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రాంతీయ అభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటు కీలకమని పేర్కొంటూ, భూ బ్యాంకులపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బి. లక్ష్మీనారాయణ, తాళ్లపూడి మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, సర్వే సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తుపాకులగూడెం ప్రభుత్వ భూములపై జాయింట్ కలెక్టర్ సమీక్ష
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 20: తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తుపాకులగూడెం గ్రామంలో పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదించిన ప్రభుత్వ భూ బ్యాంకులను జాయింట్ కలెక్టర్ కె. మేఘస్వరూప్ బుధవారం పరిశీలించారు. కొవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావుతో కలిసి భూముల స్థితిగతులను పరిశీలిస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూభాగాల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను సమగ్రంగా గుర్తించి, పూర్తి స్థాయి రికార్డులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాంతీయ అభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటు కీలకమని పేర్కొంటూ, భూ బ్యాంకులపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావు, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బి. లక్ష్మీనారాయణ, తాళ్లపూడి మండల తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, సర్వే సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

