తిరుపతి సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి
తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు ప్లై91 నూతన విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ఈ సర్వీసును ప్రారంభించారు. విమానాశ్రయ అగ్నిమాపక విభాగం వాటర్ కేనన్ సెల్యూట్‌తో స్వాగతం పలికింది. అనంతరం తొలి ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ అందజేసి కేక్ కట్ చేశారు.


