*అతివేగంతో అదుపుతప్పిన కారు*
*రొయ్యలగుంటలోకి దూసుకెళ్లిన కారు*
*తృటిలో తప్పిన పెను ప్రమాదం*.
*నాయుడుపేట మండలం పూడేరు చెందిన నలుగురు సురక్షితం*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 10 వాకాడు మండలం,*
*తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం బీచ్‌కు వెళ్తున్న సమయంలో ఓ కారు అదుపుతప్పి రొయ్యలగుంటలోకి దూసుకెళ్లిన ఘటన వాకాడు మండలం కొండూరు సమీపంలోని రొయ్యలగుంట మలుపు వద్ద చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాయుడుపేటకు మండలం పూడేరుకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో తూపిలిపాలెం బీచ్‌కు వెళ్తుండగా, కొండూరు సమీపంలోని రొయ్యలగుంట మలుపు వద్ద కారు అతివేగంగా వెళ్లడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రహదారి పక్కనే ఉన్న రొయ్యలగుంటలోకి దూసుకెళ్లింది.ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు సహకరించారు.*



