Saturday, 5 September 2026
  • Home  
  • వివాహ వార్షికోత్సవం వేళ ఆశ్రమానికి నిత్యావసర సరుకుల వితరణ
- తిరుపతి

వివాహ వార్షికోత్సవం వేళ ఆశ్రమానికి నిత్యావసర సరుకుల వితరణ

చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద శ్రీ నారాయణమ్మ స్థాపించిన శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ధర్మనిధి చారిటబుల్ ట్రస్టు సభ్యులు భీము వెంకట సుబ్బారెడ్డి, కుసుమకుమారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమానికి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు తదితర నిత్యావసర సరుకులను అందజేశారు. నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పురం రామ్మోహన్, గోపాల్ వలసాని స్వయంగా ఆశ్రమానికి చేరుకుని సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పెద్దలు, వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. దాతలు అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు. ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భీము వెంకట సుబ్బారెడ్డి, కుసుమకుమారి దంపతులు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుటుంబాల్లో జరిగే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభకార్యాలను ఆశ్రమంలో నిర్వహించుకోవచ్చని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.