రామచంద్రాపురంమండలంలోని కమ్మ కండ్రిగ గ్రామంలో ఉన్న చేకూరి నాగమనాయుడు ఎర్రమ్మల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయులుగా సేవలందించిన డా,, తిరుమణ్యం రాజశేఖర్ రెడ్డి సేవలు చిరుస్మరణీయమని మండల విద్యాశాఖ అధికారి వి మార్కండేయ నాయుడు అన్నారు. మంగళవారం పాఠశాల ఆవరణంలో పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థుల అభ్యున్నతికి కృషిచేసి, తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించిన వ్యక్తిని కొనియాడారు. ఎంఈఓ 2 జయవేలు మాట్లాడుతూ విద్య బోధనలో నైపుణ్యాలు ప్రదర్శించి విద్యార్థులకు విద్యా బోధన చేసేవారని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. సునీత మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా వారు చేసిన విశేష సేవలను కొనియాడారు, డా,, తిరుమణ్యం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యసిద్ధి కోసం కృషి చేయాలన్నారు. పేదరిక నిర్మూలనకు విద్య ఏకైక మార్గమన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, వివిధపాఠశాల నుంచి వచ్చిన హెచ్ఎంలు,ఉపాధ్యాయులు ,ఉపాధ్యాయ సంఘం నాయకులు, పాఠశాల సిబ్బంది డా,,రాజశేఖర్ రెడ్డి, బండి అరుణ దంపతులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎన్ ఈశ్వర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆచార్యులు పిసి వెంకటేశ్వర్లు, ఎస్ ఎల్ టి ఏ జిల్లా అధ్యక్షులు దొడ్డ ఉమామహేశ్వర్, ఐ వెంకటరామయ్య, కృష్ణార్జున రెడ్డి, దిలీప్ కుమార్, శ్రీరాములు, కోటేశ్వర బాబు, విశ్వనాథం, శాంతి , భార్గవి,హిమబిందు, మునిరాజ, ఉపాధ్యాయునీ,ఉపాధ్యాయులు విద్యార్థులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్.
1. డా,, తిరు మణ్యం రాజశేఖర్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు.


